హసన్‌పర్తి, తెలంగాణ గళం,(అక్టోబర్1):
హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక స్నేహ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బొడ్డెమ్మ పండుగను పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు, యువతులు, మహిళలు, పెద్దలు అంతా ఒక్కచోటికి చేరి బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ, చప్పట్లు కొడుతూ సాంప్రదాయ పాటలతో సందడి చేశారు. అందరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా బొడ్డెమ్మ ఆట ఆడటం విశేషం. ఈ వేడుకలు విజయవంతం కావడానికి స్నేహ యూత్ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
న్యూస్ ప్రతినిధి : మోడెం సందీప్.






