చింతగట్టులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
• ముఖ్య అతిథిగా పాల్గొన్న హనుమకొండ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎరుకొండ శ్రీనివాస్
చింతగట్టు(హనుమకొండ),తెలంగాణగళం,అక్టోబర్ 2:
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎరుకొండ శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని గాంధీ గారి విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఎరుకొండ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటికీ ఆచరణీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పోచమ్మ గుడి అంగన్‌వాడీ కేంద్రం టీచర్ మోడెం స్వప్న, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రతినిధి ఎరుకొండ సునీల్, గ్రామానికి చెందిన మహిళలు, పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను విజయవంతం చేశారు
న్యూస్ ప్రతినిధి : మోడెం సందీప్






