ఎడ్యుకేషన్

చింతగట్టు అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు:

హసన్‌పర్తి : తెలంగాణ గళం న్యూస్ (సెప్టెంబర్ 4): చింతగట్టు (హనుమకొండ):GWMC పరిధి హనుమకొండ జిల్లా 65వ డివిజన్‌లోని చింతగట్టు గ్రామం పోచమ్మగుడి అంగన్‌వాడీ కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవ…

By · · Updated

Share this article

హసన్‌పర్తి : తెలంగాణ గళం న్యూస్ (సెప్టెంబర్ 4):

చింతగట్టు (హనుమకొండ):GWMC పరిధి హనుమకొండ జిల్లా 65వ డివిజన్‌లోని చింతగట్టు గ్రామం పోచమ్మగుడి అంగన్‌వాడీ కేంద్రంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని కేంద్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రంగురంగుల తోరణాలతో అందంగా అలంకరించారు.

ఈ వేడుకల్లో అంగన్‌వాడీ చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి వేషధారణలలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల ఆటపాటలు, కోలాటాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 'ఉట్టి కొట్టే' కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. బాలకృష్ణుడి వేషంలో ఉన్న చిన్నారులు పోటీపడి ఉట్టిని కొట్టి పండుగ సంబరాలను రెట్టింపు చేశారు.

ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ మోడెం స్వప్న గారు, మాట్లాడుతూ.. చిన్నారులకు చిన్నతనం నుంచే మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు మరియు పండుగల విశిష్టతను తెలియజేసేందుకే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం చిన్నారులకు తీపి పదార్థాలు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, బాలల తల్లులు,  మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

Tags: