హైదరాబాద్ :చట్టసభల్లో బీసీల కు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు కేంద్రం చేపట్టే కుల గణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చాలని బీసీ హక్కుల పోరాట వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు తోట శ్రీనివాస్ పటేల్, వైస్ చైర్మన్ కొల్లకుంట నాగరాజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ మహిళలకు రాజకీయాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు మరియు సబ్సిడీ రుణాలు అందజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాల పేద విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యతోనే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగలరని పిలుపునిచ్చారు.
బీసీల హక్కుల సాధన మరియు సమస్యల పరిష్కారం కోసం బీసీ హక్కుల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఉధృత ఉద్యమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో వేదిక నాయకులు నాగేశ్వర రావు, రోహిత్, కౌటం రమేష్, రాజు బెస్త, నాగరాజు వడ్డేపల్లి తదితరులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు





