తెలంగాణ

చాసిస్ నుంచి రోబోట్ వరకు 18 నెలల్లో మాస్ రోబోట్-1

చాసిస్ నుంచి రోబోట్ వరకు.. 18 నెలల కృషితో మాస్ రోబోట్-1 రూపకల్పన వరంగల్‌కు చెందిన వెంకటేష్ మిర్యాల్కర్ అమెరికాలో వినూత్న ప్రయోగం పవర్‌ట్రెయిన్ నుంచి నెట్‌వర్కింగ్ వ్యవస్థ వరకు సొంతంగా అభివృద్ధి హన…

By · · Updated

Share this article
చాసిస్ నుంచి రోబోట్ వరకు 18 నెలల్లో మాస్ రోబోట్-1

చాసిస్ నుంచి రోబోట్ వరకు.. 18 నెలల కృషితో మాస్ రోబోట్-1 రూపకల్పన

వరంగల్‌కు చెందిన వెంకటేష్ మిర్యాల్కర్ అమెరికాలో వినూత్న ప్రయోగం

పవర్‌ట్రెయిన్ నుంచి నెట్‌వర్కింగ్ వ్యవస్థ వరకు సొంతంగా అభివృద్ధి

హనుమకొండ టౌన్, తెలంగాణ గళం, సెప్టెంబర్ 28:

 

వరంగల్‌కు చెందిన వెంకటేష్ మిర్యాల్కర్ అమెరికాలో రోబోటిక్స్ రంగంలో తన ప్రతిభను చాటుకుంటూ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సుమారు *

 

*18 నెలలపాటు నిరంతర శ్రమించి ‘మాస్ రోబోట్-1’*

 

ను రూపొందించారు. సాధారణ చాసిస్ నిర్మాణంతో ప్రారంభమైన ఈ ప్రయాణం.. విద్యుత్ సరఫరా, పవర్‌ట్రెయిన్, సెన్సర్లు, మైక్రోకంట్రోలర్లు, కంప్యూటింగ్ మాడ్యూళ్లు, అంతర్గత నెట్‌వర్కింగ్ వ్యవస్థల రూపకల్పన వరకు విస్తరించింది.

రోబోట్‌లోని వివిధ భాగాలకు విద్యుత్‌ను సమర్థవంతంగా అందించేందుకు ప్రత్యేకంగా పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులను వెంకటేష్ స్వయంగా రూపొందించారు. 

 

అలాగే సెన్సర్లు, మైక్రోకంట్రోలర్లు, కంప్యూటింగ్ మాడ్యూళ్ల మధ్య టెలిమెట్రీ సమాచారాన్ని సమన్వయం చేసేందుకు ప్రత్యేకమైన ఆన్‌బోర్డ్ నెట్‌వర్కింగ్ వ్యవస్థను మొదటి నుంచి అభివృద్ధి చేశారు.

 

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..

మాస్ రోబోట్-1 కమ్యూనికేషన్ వ్యవస్థను భవిష్యత్ విస్తరణకు అనుకూలంగా రూపొందించడం ఈ ప్రాజెక్టులో మరో కీలక అంశంగా నిలిచింది. డీసెంట్రలైజ్డ్ మెష్ నెట్‌వర్క్‌లతో అనుసంధానం చేసుకునే విధంగా వ్యవస్థను ముందుగానే సిద్ధం చేశారు.

 

దీంతో భవిష్యత్‌లో ఒకే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే అనేక మాస్ రోబోట్ యూనిట్లు పరస్పరం సమాచారాన్ని పంచుకోవడంతో పాటు మ్యాపింగ్ డేటాను సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఒకే యూనిట్‌పై ఆధారపడకుండా అనేక రోబోట్‌లు సమన్వయంతో పనిచేసే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మార్గం సుగమమవుతుంది.

పటిష్టమైన 

 

పునాదులతో మాస్ రోబోట్-1

 

పొలాల్లో ఎదురయ్యే కఠిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాస్ రోబోట్-1 భౌతిక నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. పటిష్టమైన చాసిస్, అధిక టార్క్‌ను అందించే పవర్‌ట్రెయిన్, ఆధునిక నెట్‌వర్కింగ్ వ్యవస్థ రోబోట్‌కు ప్రాథమిక పునాదులుగా నిలిచాయి.

 

భవిష్యత్‌లో అధిక పనితీరు కలిగిన కృత్రిమ మేధస్సు (ఏఐ), భద్రతా వ్యవస్థలు, అధునాతన ఆటోమేషన్ సాంకేతికతలను అనుసంధానించేందుకు అనువుగా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.

 

వరంగల్‌కు చెందిన యువకుడు అమెరికాలో తన సాంకేతిక నైపుణ్యాన్ని వినూత్న ఆలోచనగా మలిచి, వ్యవసాయ రంగంలో భవిష్యత్ రోబోటిక్స్‌కు ఉపయోగపడేలా మాస్ రోబోట్-1ను అభివృద్ధి చేయడం విశేషంగా నిలిచింది.

Tags: