తెలంగాణ

చాకలి ఐలమ్మ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రేవూరి 

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు - ఘనంగా నివాళులు పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహ…

By · · Updated

Share this article
చాకలి ఐలమ్మ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రేవూరి 

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు - ఘనంగా నివాళులు

పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 26:

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ గారి 131వ జయంతి వేడుకలను హనుమకొండలో ఘనంగా నిర్వహించారు.

న్యూ శాయంపేటలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

Tags: