తెలంగాణ

బీజేపీ వినతికి స్పందన.ప్రభుత్వ స్థలానికి హెచ్చరిక బోర్డు

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 28  ప్రభుత్వ భూముల పరిరక్షణకు బీజేపీ పరకాల పట్టణ శాఖ చేసిన విజ్ఞప్తికి అధికార యంత్రాంగం స్పందించింది. పరకాల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న సర్వే నంబర్ 950లోని ప్ర…

By · · Updated

Share this article
బీజేపీ వినతికి స్పందన.ప్రభుత్వ స్థలానికి హెచ్చరిక బోర్డు

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 28 

ప్రభుత్వ భూముల పరిరక్షణకు బీజేపీ పరకాల పట్టణ శాఖ చేసిన విజ్ఞప్తికి అధికార యంత్రాంగం స్పందించింది. పరకాల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న సర్వే నంబర్ 950లోని ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

ఈ స్థలాన్ని పరిరక్షించడంతో పాటు ఆక్రమణలను అడ్డుకోవాలని కోరుతూ బీజేపీ పరకాల పట్టణ శాఖ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ఈ నెల 11న పరకాల తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన అధికారులు స్థలాన్ని పరిశీలించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు.

అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణకు అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని గాజుల నిరంజన్ కోరారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించే వరకు బీజేపీ తరఫున కృషి కొనసాగిస్తామని తెలిపారు.

ప్రభుత్వ స్థల పరిరక్షణకు చర్యలు తీసుకున్న పరకాల తహసీల్దార్‌కు బీజేపీ పరకాల పట్టణ శాఖ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. జయంతీలాల్, కౌన్సిలర్ కుక్కల విజయకుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి, వేముల సధారాణి, మిడిదొడ్డి నరేష్, సంఘ పురుషోత్తం, ఉడుత చిరంజీవి, దుబాసి కృష్ణ ప్రసాద్, మెంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: