తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్‌ఎస్ నేతకు చల్లా పరామర్శ

నమిండ్ల శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 28  రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీడబ్…

By · · Updated

Share this article
రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీఆర్‌ఎస్ నేతకు చల్లా పరామర్శ

నమిండ్ల శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే

పరకాల తెలంగాణ గళం సెప్టెంబర్ 28 

రోడ్డు ప్రమాదంలో గాయపడి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీడబ్ల్యూఎంసీ 15వ డివిజన్ గొర్రెకుంట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నమిండ్ల శ్రీనివాస్‌ను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రికి వెళ్లిన చల్లా ధర్మారెడ్డి శ్రీనివాస్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులను అడిగి చికిత్స వివరాలను తెలుసుకోవడంతో పాటు, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. శ్రీనివాస్ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చల్లా ధర్మారెడ్డి ఆకాంక్షించారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: