పరకాల బతుకమ్మ ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లను పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు.
పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 08:
గురువారం పరకాలలో బతుకమ్మ వేడుకలు జరిగే దామెర చెరువు, అంగడి మైదానం ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బతుకమ్మ ఆడే ప్రాంతాలలో పారిశుధ్య నిర్వహణ మెరుగ్గా ఉండాలని, విద్యుత్ దీపాలు, ఇతర వసతులను కల్పించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, ఆర్డీవో డీఎస్ వెంకన్న, తహసిల్దార్ విజయలక్ష్మి, కౌన్సిలర్లు బండి శ్రీధర్, అల్లె దశరథం, కుక్కల విజయ్, ఏఈ ప్రవీణ్ కుమార్, టీపీఎస్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.





