ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలి:
మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్
పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 07:
పరకాల పట్టణంలో బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్ పరిశీలించారు.

బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అంగడి మైదానంతో పాటు బతుకమ్మలు నిమజ్జనం చేసే దామరచెరువు ప్రాంతాన్ని సందర్శించి అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
అలాగే దసరా ఉత్సవాల సందర్భంగా బొడ్రాయి ప్రాంతం, గడి ప్రాంతం, రథాన్ని తీసుకెళ్లే చెన్నకేశవస్వామి దేవాలయ పరిసరాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, రహదారులు, వెలుగులు, ప్రజలకు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నల్లెల్ల కుమార్, గూడెల్లి సదన్న, బండి శ్రీధర్, కొయ్యడా శ్రీనివాస్, పాలకుర్తి శ్రీను, సుదమల్ల రమేష్, అల్లె దశరథం, కుక్కల విజయ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఒంటేరు శ్రవణ్ కుమార్, ఏకు విద్యాసాగర్, పోరండ్ల వేణు, పసుల రమేష్, బొచ్చు సల్మాన్, గొడుగు నాగరాజు, బొచ్చు బాబురావు, ఆకుల శ్రీధర్, జాఫర్ రిజ్వి, టౌన్ ప్లానింగ్ అధికారి రాజకుమార్, పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.






