తెలంగాణ

బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి 9 రోజుల పూల పండుగ విశిష్టత

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ - ప్రకృతి ఆరాధనతో ఘనంగా పూల పండుగ పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 10: తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా జరుపుకునే పండుగ…

By · · Updated

Share this article
బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి 9 రోజుల పూల పండుగ విశిష్టత

తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ - ప్రకృతి ఆరాధనతో ఘనంగా పూల పండుగ

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 10:

తెలంగాణ సంస్కృతికి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ.

ఔషధ గుణాలున్న తంగేడు, గునుగు, బంతి వంటి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను కొలుస్తారు. బతుకమ్మ అంటే 'బతుకునిచ్చే తల్లి' లేదా 'జీవించు తల్లి' అని అర్థం.

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, కుటుంబం సంతోషంగా ఉండాలని, యువతులు మంచి భర్త రావాలని కోరుతూ 9 రోజుల పాటు ఈ పూల పండుగను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

 

Tags: