తెలంగాణ గళం/హాసన్ పర్తి(సెప్టెంబర్ 19):
గాలికి రూ. 50 దోపిడీ:
ఉచితంగా ఇవ్వాల్సిన టైర్ ఎయిర్ సర్వీస్‌కు కొన్ని బంకుల్లో రూ. 20 నుండి రూ. 50 వసూలు చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే గాలి కొట్టేదే లేదంటున్నారు.
తాళాల వెనక వాష్‌రూమ్‌లు:
సాధారణ ప్రజలు, మహిళలకు అందుబాటులో ఉండాల్సిన టాయిలెట్లకు బంక్ సిబ్బంది తాళాలు వేసి సొంతానికి వాడుకుంటున్నారు. అడిగితే 'కీ లేదు.. రిపేర్' అంటూ అబద్ధాలు చెప్తున్నారు.
తాగునీరు మృగ్యం:
ప్రయాణికుల కోసం కనీస తాగునీటి సదుపాయం కూడా బంకుల్లో కనిపించడం లేదు.
అధికారులు స్పందించాలి:
నిబంధనలు ఉల్లంఘిస్తే తొలిసారి రూ. 10,000 జరిమానా, తదుపరి బంక్ లైసెన్స్ రద్దు చేసే చట్టం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల్లో తనిఖీలు జరిపి, వినియోగదారుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.





