తెలంగాణ

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు: రూ. 5 లక్షల ఎల్ఓసీ చెక్కు పంపిణీ హనుమకొండ, సెప్టెంబర్ 17:  అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబానికి వర్ధన్నపేట ఎమ…

By · · Updated

Share this article
బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు: రూ. 5 లక్షల ఎల్ఓసీ చెక్కు పంపిణీ

హనుమకొండ, సెప్టెంబర్ 17: 

అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అండగా నిలిచారు. గుండ్లసింగారం గ్రామానికి చెందిన చల్లూరి రాజేందర్ వైద్య చికిత్స కోసం ప్రభుత్వం నుండి రూ. 5 లక్షల విలువైన ఎస్ఓసీ (SOC) మంజూరైంది.

ఈ మేరకు గురువారం సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేఆర్ నాగరాజు గారు బాధిత కుటుంబ సభ్యులకు ఈ చెక్కును స్వయంగా అందజేశారు. సీఎం సహాయ నిధి ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతోందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఆర్థిక సహాయం అందేలా కృషి చేసినందుకు రాజేందర్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు