తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి  పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 08  పరకాల ఆర్టీసీ డిపో యందు టీజీఎస్ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా టి డబ్ల్యూ యూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్, ఐ…

By · · Updated

Share this article
ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం

ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే  రేవూరి ప్రకాశ్ రెడ్డి 

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 08 

పరకాల ఆర్టీసీ డిపో యందు టీజీఎస్ఆర్టీసీ ఎన్నికల సందర్భంగా టి డబ్ల్యూ యూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్, ఐ ఎన్ టి యూ సి కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. రీజియన్ క్లాస్ సీరియల్ నెంబర్ 6, స్టేట్ క్లాస్ సీరియల్ నెంబర్ 3 బాణం గుర్తుపై ఓటు వేసి ఐక్య కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆర్టీసీ కార్మికులను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తుందని అన్నారు.ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ఐక్య కూటమి అభ్యర్థులు కృషి చేస్తారని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఆర్టీసీ కార్మికుల ఎన్నికలను అడ్డుకుని, వారి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తూ, వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.ఐక్య కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

Tags: