పరకాల, తెలంగాణ గళం, సెప్టెంబర్ 26:
ఆపద వేళ అండగా ఆపదమిత్రలువాలంటీర్లకు రక్షణ కిట్ల పంపిణీ
విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ఆపదమిత్ర వాలంటీర్లు సిద్ధంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సూచించారు. హనుమకొండ జిల్లా అగ్నిమాపక కేంద్రంలో డీఎఫ్ఓ సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆపదమిత్ర వాలంటీర్లకు రక్షణ కిట్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీఎఫ్ఓ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో వరదలు, భవనాల కూల్చివేతలు, రోడ్డు ప్రమాదాలు వంటి విపత్కర పరిస్థితుల్లో ఆపదమిత్ర వాలంటీర్లు ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు. విపత్తుల సమయంలో తక్షణ స్పందనతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు.ఎస్ఎఫ్ఓ భద్రయ్య మాట్లాడుతూ.. ఇళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు, పాము కాటు, గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఆపదమిత్ర వాలంటీర్ల సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
ప్రమాద సమయంలో ప్రాథమిక సహాయం అందిస్తూ బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో వాలంటీర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఆపదమిత్ర వాలంటీర్ సీపతి రాజు మాట్లాడుతూ.. విపత్తులు సంభవించిన సమయంలో అగ్నిమాపక శాఖ అధికారుల సూచనల మేరకు ప్రజలకు సహాయం అందించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది, పరకాల ఆపదమిత్ర వాలంటీర్లు పాల్గొన్నారు.





