దుంపిల్లపల్లి, సెప్టెంబర్ 22, తెలంగాణ గళం.
వినాయక చవితి సందర్భంగా దుంపిల్లపల్లిలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమం అనంతరం ఉపయోగించిన విస్తరకులను తొలగించకపోవడంతో పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంది. అన్నదానానికి హాజరైన భక్తులు భోజనం చేసిన తర్వాత పడేసిన విస్తరకులు అక్కడే పేరుకుపోయాయి.
అన్నదానం కార్యక్రమం ముగిసిన వెంటనే పరిసరాలను శుభ్రం చేయాల్సిన గ్రామ సిబ్బంది విస్తరకులను తొలగించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాంగణంలో చెత్తాచెదారం నేరుగా స్థానికులే తీసి శుభ్రం చేసారు.
వినాయక ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. అన్నదానం వంటి కార్యక్రమాలు ముగిసిన వెంటనే వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




