తెలంగాణ

అల్లూరి యూత్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన, మహా అన్నదానం

తెలంగాణ గళం హనుమకొండ , సెప్టెంబర్ 22: పర్వతగిరి మండల కేంద్రంలోని అల్లూరి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళ…

By · · Updated

Share this article
అల్లూరి యూత్, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన, మహా అన్నదానం

తెలంగాణ గళం హనుమకొండ , సెప్టెంబర్ 22:

పర్వతగిరి మండల కేంద్రంలోని అల్లూరి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అల్లూరి యూత్, పర్వతగిరి మండల ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో భక్తి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

​ముందుగా స్థానిక మహిళలు భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ చీదురు శంకర్, అల్లూరి యూత్ అధ్యక్షుడు నాగుల రాజు, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముదరకోళ్ల నాగరాజులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజా కార్యక్రమాలతో పాటు ఇలాంటి అన్నదాన సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

​ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు కొల్లూరి నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు అనుమాన్ల దేవేందర్, భూక్య ప్రవీణ్, అల్లూరి యూత్ ప్రతినిధులు, సభ్యులు, గ్రామస్తులు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.