తెలంగాణ

కుంకుమేశ్వర ఆలయ చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం

పరకాల, తెలంగాణ గళం ,అక్టోబర్ 01: పరకాల:పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చైర్మన్‌గా ఉన్నప్ప…

By · · Updated

Share this article
కుంకుమేశ్వర ఆలయ చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు ప్రమాణ స్వీకారం

పరకాల, తెలంగాణ గళం ,అక్టోబర్ 01:

పరకాల:పట్టణంలోని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా కొలుగూరి రాజేశ్వరరావు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు దేవస్థానానికి చెందిన 4.11 ఎకరాల భూమిని సాధించి హద్దులు ఏర్పాటు చేశామని, మహా రుద్రయాగం, హిందూ సమ్మేళనం, కార్తీక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈసారి దేవస్థానం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు, ఆదాయం కోసం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు.

ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ పదవిని లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్ల పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిందని, కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతితో కుంభాభిషేకంపై చర్చించినట్లు తెలిపారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, భక్తులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

Tags: