తెలంగాణ

ఆకులవాడలో 6వ రోజు గణపతి పూజలు

పరకాల, తెలంగాణ గళం , సెప్టెంబర్ 19: పరకాల పట్టణంలోని ఆకుల వాడలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడుకి 6వ రోజు పూజలను ఘనంగా అందుకుంటున్నాడు.   ఈ సందర్భంగా శనివారం గణపతి మండపంలో ప్రత్యేక పూజలు…

By · · Updated

Share this article
ఆకులవాడలో 6వ రోజు గణపతి పూజలు

పరకాల, తెలంగాణ గళం , సెప్టెంబర్ 19:

పరకాల పట్టణంలోని ఆకుల వాడలో మున్నూరు కాపు ఆధ్వర్యంలో కొలువైన గణనాథుడుకి 6వ రోజు పూజలను ఘనంగా అందుకుంటున్నాడు.

 

ఈ సందర్భంగా శనివారం గణపతి మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆకుల పూజ శ్రీ, వెంకటేశ్వర్లు, ఆకుల రాణి, కృష్ణ దంపతులు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకునికి అర్చనలు చేసి భక్తులకు స్వామి ఆశీస్సులు అందించారు.

గత 6 రోజులుగా ఆకుల వాడలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణనాథుని దర్శించుకుంటున్నారు. మండపం వద్ద భక్తి శ్రద్ధలతో కోలాహలం నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఆకుల వాడ, మున్నూరు కాపు, భక్తులు కుటుంబ, సభ్యులు నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags: