నడికుడా , తెలంగాణ గళం, సెప్టెంబర్ 29:
నడికుడా మండలం ,కంటాత్మకూర్ గ్రామంలో ఐరన్ పోల్స్ లేని గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సర్పంచ్ కోంగంటి తిరుపతి అన్నారు. 26 ఐరన్ పోల్స్ స్థానంలో 26 సిమెంట్ పోల్స్ మంజూరు కావడం సంతోషకరమని, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
జేఎల్ఎం ప్రసాద్ పర్యవేక్షణలో జరుగుతున్న పనులను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. వర్షాకాలంలో ఐరన్ పోల్స్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని, అందుకే వాటిని తొలగించి సిమెంట్ పోల్స్ వేస్తున్నామని సర్పంచ్ తెలిపారు. పనుల సమయంలో కొంతసేపు కరెంటు బంద్ అవుతుందని, ప్రజలు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమారస్వామి, వార్డు సభ్యులు తడక రఘుపతి, కార్యదర్శి ఆవుల కుమార్, జేఎల్ఎం ప్రసాద్, అసిస్టెంట్ కరుణాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.






