ఐనవోలుకు MPDO ఆఫీసు, పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలి: వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు,
హసన్‌పర్తి, సెప్టెంబర్ 16:
ఐనవోలు మండలానికి నూతన ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్‌ను తక్షణమే మంజూరు చేయాలని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారు, ప్రభుత్వం డిమాండ్ చేశారు. బుధవారం శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ఐనవోలు ప్రాంత అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం ఐనవోలును నూతన మండలంగా ప్రకటన చేయడానికే పరిమితమైందని, గత పదేళ్ల పాలనలో మండలాభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఎమ్మెల్యే నాగరాజు గారు, విమర్శించారు. కనీస పాలనా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇటీవలే ఐనవోలు మండలానికి తహశీల్దార్ కార్యాలయాన్ని మంజూరు చేసిన రెవెన్యూ శాఖ మంత్రికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదే రీతిలో మండల ప్రజల పరిపాలనా, రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే MPDO ఆఫీసును, పోలీస్ స్టేషన్‌ను మంజూరు చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.
హసన్పర్తి మండల రిపోర్టర్ : మోడెమ్ సందీప్






