గూడూరు అక్టోబర్ 1(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 7వ తారీకు వరకు 72వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ రావు తెలిపారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి రేంజి పరిధిలో ఏడు రోజులపాటు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఇందులో భాగంగా గురువారం గూడూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పరశురాములు ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు వన్యప్రాణులు అడవుల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు వారోత్సవాల్లో భాగంగా రాబోయే రోజులు విద్యార్థులకు చట్టాలు వన్యప్రాణి సంరక్షణ సహజ వనరులు అడవుల పర్యావరణం పై నిరంతరం అవగాహన కల్పించినట్లు తెలిపారు అపరాజుపల్లి సెక్షన్ లో సహజ వనరులు అడవుల రక్షణ పై అవగాహన కల్పించారు మండల స్థాయి అధికారులతో మండల కేంద్రంలో సమావేశం నిర్వహించి చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బుచ్చిబాబు సెక్షన్ ఆఫీసర్ నవీన్ కుమార్ బీట్ ఆఫీసర్ చాణిక్య ప్రిన్సిపల్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు
72వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు.
గూడూరు అక్టోబర్ 1(తెలంగాణ గళం) : గూడూరు మండలంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 7వ తారీకు వరకు 72వ వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాద్ రావు తెలిపారు…
By తెలంగాణ గళం · · Updated
Share this article






