పరకాల ప్రజలకు శుభవార్త.. 100 పడకల ఆసుపత్రి ప్రారంభం
పరకాల, తెలంగాణ గళం,సెప్టెంబర్ 24:
నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మరియు హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరకాలలోని 30 పడకల ఆసుపత్రికి సంబంధించిన ఇన్-పేషెంట్, అవుట్-పేషెంట్ సేవలు నూతన 100 పడకల ఆసుపత్రికి తరలించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
శనివారం, 26.09.2026 నుండి నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా హాస్పిటల్‌లోనే అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
కావున హనుమకొండ జిల్లా పరకాల ప్రాంత ప్రజలు నూతన ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని కోరారు.





