*విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యం లో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహనా ర్యాలీ*
తిరుపతి, అక్టోబర్ 10, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:
శ్రీపద్మవతి మహిళా విశ్వవిద్యాలయం లో, విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు (యూనిట్స్: IX, X, XII) ఆధ్వర్యంతో ప్లాస్టిక్ వ్యతిరేక అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా విద్యార్థులు ప్లాస్టిక్ వినియోగం తగ్గించడo వల్ల లక్ష్యిత పరిసరాల పరిరక్షణ, ఆరోగ్య రక్షణ మరియు పర్యావరణ సంరక్షణపై అవగాహన పెంచడం ప్రధాన ఉద్దేశ్యంగా తీసుకోబడింది. "నో టూ ప్లాస్టిక్", "ప్లాస్టిక్ వదిలి పర్యావరణాన్ని ఆదరించండి", మరియు " శుభ్రమైన నీళ్ళు, నేల, వాయువు కోసం ప్లాస్టిక్ వాడకాని తగ్గించండి" అనే తదితర సందేశాలతో ర్యాలీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో సాగింది. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా. వి. జ్యోత్స్న కల్పన, ఆర్.దివ్య, ఎం. పల్లవి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

