ఆంధ్రప్రదేశ్

*జనసేన  తిరుపతి పార్లమెంట్ నిర్వాహక్ దళంలో బాలసుబ్రమణ్యం అయ్యంగారు*

తిరుపతి, అక్టోబర్ 10, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:  జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ  తిరుపతి పార్లమెంట్  నిర్వాహక్ దళంలో  సభ్యుడిగా తిరు…

By · · Updated

Share this article

తిరుపతి, అక్టోబర్ 10, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:

 జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ  తిరుపతి పార్లమెంట్ 
 నిర్వాహక్ దళంలో  సభ్యుడిగా తిరుపతి పార్లమెంట్ పరిధి నుంచి జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ముత్యాలరెడ్డి పల్లి క్లస్టర్ ఇంచార్జ్ మరియు వన్యకుల క్షత్రియ సంఘం రాష్ట్ర డైరెక్టర్ బాలసుబ్రమణ్యం అయ్యంగార్ని నియమించిన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, తిరుపతి శాసన సభ్యులు ఆరని శ్రీనివాసులు గారు మరియు పసుపులేటి హరిప్రసాద్ గారికి బాలసుబ్రమణ్యం అయ్యంగారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ  సందర్భంగా పార్టీ నాయకత్వం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంతో జనసేన శ్రేణుల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై పనిచేసే తీరుకు ఈ నియామకం గుర్తింపుగా నిలుస్తుందని జనసేన శ్రేణులు భావిస్తున్నారు. ఈ బాధ్యతలతో పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు, పార్టీ నాయకత్వానికి మధ్య సమన్వయం పెంపొందించేందుకు ఆయన కృషి చేస్తారు అని పార్టీ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. బాలసుబ్రమణ్యం అయ్యంగారు కి ఈ బాధ్యతలు దక్కడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags: