ఆంధ్రప్రదేశ్

*పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా. ఎస్ఎమ్ సి ఛైర్పర్సన్ భానుప్రియ*

 చిత్తూరు, అక్టోబర్ 10, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:  పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎస్ఎంసి చైర్‌పర్సన్‌ భానుప్రియ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని పాత మార్కెట్ సమీపంలో ఉన్న జైహింద్ నగర పాలక ప…

By · · Updated

Share this article

 చిత్తూరు, అక్టోబర్ 10, తెలంగాణ గళం జిల్లా ప్రతినిధి:

 పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎస్ఎంసి చైర్‌పర్సన్‌ భానుప్రియ పేర్కొన్నారు. చిత్తూరు పట్టణంలోని పాత మార్కెట్ సమీపంలో ఉన్న జైహింద్ నగర పాలక ప్రాథమిక పాఠశాల "పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసీ) చైర్‌పర్సన్‌గా భానుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయినా సందర్బంగా శుక్రవారం ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్న కమిటీ సభ్యులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని భానుప్రియ పేర్కొన్నారు. కమిటీ సభ్యులు, తల్లిదండ్రుల సహకారంతో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతోపాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన భానుప్రియను తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్పర్సన్ కరిష్మా,ప్రధానోపాధ్యాయుడు ప్రకాష్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: