ఆంధ్రప్రదేశ్

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు రాజీనామా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస…

By · · Updated

Share this article
వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు రాజీనామా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు చిన్న శ్రీను వెల్లడించారు. మజ్జి శ్రీనివాసరావు ప్రస్తుతం విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, భీమిలి సమన్వయకర్త కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీతో పాటుగా ఆయా పదవులకు కూడా చిన్న శ్రీను రాజీనామా చేశారు. రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపించారు.

ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను ( మజ్జి శ్రీనివాసరావు ) వైసీపీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా.. భీమిలీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న చిన్న శీను.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా.. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానంటూ రాజీనామా లేఖను వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు పంపించారు. మరోవైపు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గానూ మజ్జి శ్రీనివాసరావు పనిచేశారు. మజ్జి శ్రీనివాసరావు రాజీనామాతో ఉత్తరాంధ్రలో వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీను.. తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపైనా, ఏ పార్టీలోకి చేరతారనే దానిపైనా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags: