భక్తి

శ్రీమహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు

విజయదశమి వేడుకలకు మహంకాళి యూత్ కమిటీ ఏర్పాట్లు By Lakavath Sudhir  ఇల్లందు, అక్టోబరు 19 (తెలంగాణ గళం): ఇల్లందు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సుభాష్‌నగర్‌లో మహంకాళి యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్…

By · · Updated

Share this article
శ్రీమహిషాసురమర్దిని అవతారంలో అమ్మవారు

విజయదశమి వేడుకలకు మహంకాళి యూత్ కమిటీ ఏర్పాట్లు

By Lakavath Sudhir 

ఇల్లందు, అక్టోబరు 19 (తెలంగాణ గళం): ఇల్లందు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సుభాష్‌నగర్‌లో మహంకాళి యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారు సోమవారం శ్రీమహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని అత్యంత ఆకర్షణీయంగా అలంకరించడంతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇల్లందు పట్టణంలో విజయదశమి సందర్భంగా జరిగే రథాల ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండుగ వేళ రథాల ఊరేగింపులతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం ఊరేగింపు నిర్వహించి, భక్తులకు దర్శనం కల్పించిన తర్వాత నిమజ్జనం చేయనున్నట్లు మహంకాళి యూత్ కమిటీ సభ్యులు తెలిపారు.

Tags: