భక్తి

శబరిమల భక్తులకు అలర్ట్

తిరువనంతపురం: వచ్చే నెల నుంచి శబరిమల మండల దీక్ష యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ భక్తుల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వ…

By · · Updated

Share this article
శబరిమల భక్తులకు అలర్ట్

తిరువనంతపురం:

వచ్చే నెల నుంచి శబరిమల మండల దీక్ష యాత్రలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డ్ భక్తుల భద్రత కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం వండిపెరియార్ సమీపంలోని వలర్డీలో కొత్తగా ఆన్‌లైన్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

 

వలర్డీలో ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి:

ఇకపై వలర్డీకి చేరుకునే భక్తులకు అక్కడికక్కడే ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు (Medical Checkups) నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో భక్తులు శారీరకంగా ఫిట్‌గా ఉన్నట్లు తేలితేనే అత్యంత కఠినమైన 'సత్రం – పుల్లుమేడు' (12 కిలోమీటర్లు) సాంప్రదాయ అటవీ మార్గంలో వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు.

గుండె జబ్బులు ఉన్నవారికి పంబా మార్గం:

బీపీ, గుండె జబ్బులు లేదా ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న భక్తులకు పుల్లుమేడు రూట్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో బోర్డు ప్రత్యామ్నాయాన్ని సూచించింది. అలాంటి వారు సులభంగా ఉండే 'పంబా' (4 కిలోమీటర్లు) మార్గం ద్వారా మాత్రమే వెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు. యాత్రికుల ఆరోగ్యం, క్షేమమే ధ్యేయంగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు బోర్డు పేర్కొంది.

 

న్యూస్ ప్రతినిధి : మోడెం సందీప్