కమలాపూర్‌లో “నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ వికసిత్ సంకల్ప్ అభియాన్” అవగాహన కార్యక్రమం
కమలాపూర్‌లోని ఎం.జె.పి. బాలికల పాఠశాలలో *“నషా ముక్త్ యువ – వికసిత్ భారత్ వికసిత్ సంకల్ప్ అభియాన్”*లో భాగంగా మత్తు పదార్థాలు, డ్రగ్స్ మరియు ఇతర హానికరమైన పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం, విద్య, కుటుంబ సంబంధాలు మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.
డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంతో పాటు తమ తోటి విద్యార్థులు మరియు సమాజంలో కూడా అవగాహన కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొని “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ నాగరాజు, డాక్టర్ అరుణ్ కుమార్, హెచ్‌ఈఓ రవీందర్, హెల్త్ అసిస్టెంట్లు బాబు, రాము, ప్రభాకర్, ఎం.జె.పి. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సౌజన్య, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
“మత్తు రహిత యువత – ఆరోగ్యకరమైన సమాజం – అభివృద్ధి చెందిన భారత్” అనే సందేశంతో కార్యక్రమం నిర్వహించారు.


