ఆరోగ్యం

ఈ జిల్లాలో ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యానికి బానిస.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర విషయాలు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 49.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం సేవిస్తున్నారు. మహిళల్లోనూ 12.9 శాతం మంది మద్యం తీసుకుంటున్నారు. పు…

By · · Updated

Share this article
ఈ జిల్లాలో ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యానికి బానిస.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర విషయాలు


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 49.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యం సేవిస్తున్నారు. మహిళల్లోనూ 12.9 శాతం మంది మద్యం తీసుకుంటున్నారు. పురుషుల్లో 9.6 శాతం, మహిళల్లో 2.1 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. మేడ్చల్‌లో మహిళల్లో 47.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. రంగారెడ్డిలో మహిళల్లో 36.8 శాతం ఊబకాయంతో బాధపడుతున్నారు. మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తున్నాయి.
హైలైట్:
రంగారెడ్డి జిల్లాలో ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యానికి బానిస
మహిళల్లో కలవరపెడుతున్న ఊబకాయం
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర విషయాలు
మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరానికి శివారుగా ఉన్న ఉమ్మడి రంగారెడ్డి ప్రాంతంలో కార్పొరేట్‌ సంస్కృతి, పని ఒత్తిడి, మారిన జీవన విధానం కారణంగా మద్యం, ధూమపానం వంటి అలవాట్లు పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో నమోదైన వివరాలు జిల్లాలో జీవనశైలి సంబంధిత సమస్యల తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. 15 ఏళ్లకు పైబడిన వారిపై నిర్వహించిన సర్వే ప్రకారం రంగారెడ్డి జిల్లాలో పురుషుల్లో మద్యం సేవించే వారి శాతం గణనీయంగా పెరిగింది. జిల్లాలో మొత్తం 49.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంటే జిల్లాలో ప్రతి ఇద్దరిలో ఒకరు మద్యానికి బానిసయ్యారు. మూడేళ్ల క్రితం నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు మూడు శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌కు సమీపంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో జీవనశైలి మార్పులు ఈ పరిస్థితికి ఒక కారణంగా నిపుణులు భావిస్తున్నారు.
మద్యం సేవించే అలవాటు పురుషులకు మాత్రమే పరిమితం కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో 12.9 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో పొరుగున ఉన్న మేడ్చల్‌ జిల్లాలో పురుషుల్లో 31.4 శాతం, మహిళల్లో 9.7 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు నమోదైంది. ఉద్యోగాల కోసం నగర ప్రాంతాలకు వలసలు, సామాజిక వాతావరణంలో మార్పులు, పని ఒత్తిడి వంటి అంశాలు ఈ అలవాట్ల పెరుగుదలకు కారణమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మద్యం అలవాటుతో పాటు ధూమపానం కూడా ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది. రంగారెడ్డి జిల్లాలో పురుషుల్లో 9.6 శాతం మంది ధూమపానం చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మహిళల్లోనూ 2.1 శాతం మంది ధూమపానం చేస్తున్నట్లు నమోదైంది. మద్యం, పొగాకు వినియోగం దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెరుగుతున్న ఊబకాయం
జీవనశైలి మార్పుల మరో ప్రభావం ఊబకాయం రూపంలో కలవరపెడుతోంది. మేడ్చల్‌ జిల్లాలో మహిళల్లో ఏకంగా 47.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. అదే సమయంలో సగటుతో పోలిస్తే 13.3 శాతం మంది మహిళలు తక్కువ బరువుతో ఉన్నట్లు వెల్లడైంది. రంగారెడ్డి జిల్లాలో 36.8 శాతం మంది మహిళలు ఊబకాయం బారినపడినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఒకవైపు అధిక బరువు, మరోవైపు తక్కువ బరువు సమస్యలు ఒకే ప్రాంతంలో కనిపించడం పోషకాహార లోపాలు, అసమతుల్య ఆహారం, శారీరక శ్రమ తగ్గడం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. పెరుగుతున్న జీవనశైలి వ్యాధులను నియంత్రించేందుకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, క్రమబద్ధమైన వ్యాయామం, సమతుల్య ఆహారం, మద్యం–పొగాకు వినియోగాన్ని తగ్గించే చర్యలు మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags: