భక్తి

ఇల్లందులో మిన్నంటిన గణనాథుల శోభాయాత్ర: భక్తజన సంద్రమైన పురవీధులు

సింగరేణి గ్రౌండ్స్ వేదికగా నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. భద్రాద్రి గోదావరి తీరానికి కదిలిన బొజ్జగణపయ్య By Lakavath Sudhir ఇల్లందు, సెప్టెంబర్ 24 (తెలంగాణ గళం): ఇల్లందు పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్…

By · · Updated

Share this article
ఇల్లందులో మిన్నంటిన గణనాథుల శోభాయాత్ర: భక్తజన సంద్రమైన పురవీధులు

సింగరేణి గ్రౌండ్స్ వేదికగా నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. భద్రాద్రి గోదావరి తీరానికి కదిలిన బొజ్జగణపయ్య


By Lakavath Sudhir 
ఇల్లందు, సెప్టెంబర్ 24 (తెలంగాణ గళం): ఇల్లందు పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ముగిశాయి. భక్తుల కోలాహలం, మేళతాళాలు, డప్పుల దరువుల నడుమ గణనాథుల శోభాయాత్ర కన్నులపండువగా సాగింది. రంగురంగుల పూలు, జిగేల్‌మనే విద్యుత్ దీపాలతో అలంకరించిన వాహనాల్లో లంబోదరుడు పురవీధుల్లో విహరిస్తుంటే, భక్తులు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడిన ఈ శోభాయాత్రలో మున్సిపల్ చైర్మన్ దొడ్డ డానియల్ కిరణ్ మిత్ర, వైస్ చైర్మన్ పెండెల రాజు, డీఎస్పీ వెంకన్న బాబు, మున్సిపల్ కమిషనర్ సందీప్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వరూపతో పాటు పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. గణనాథుల నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపల్, పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. శోభాయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుని వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.

ఇల్లందు పట్టణం, పరిసర గ్రామాల్లోని భారీ విగ్రహాలను భద్రాచలం గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి సింగరేణి గ్రౌండ్‌లో భారీ వాహనాలను సిద్ధం చేశారు. విగ్రహాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా క్రేన్ల ద్వారా వాహనాల్లోకి భద్రంగా ఎక్కించారు. భక్తులకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులకు ఇబ్బందులు లేకుండా అధికారులు నిరంతరం సమన్వయంతో పర్యవేక్షించారు. నవరాత్రుల పాటు పూజలందుకున్న బొజ్జగణపయ్య.. 'గణపతి బప్పా మోరియా.. మళ్లీ ఏడు త్వరగా రా' అనే నినాదాల మధ్య భద్రాద్రి గోదావరి వైపు కదిలాడు.

Tags: