పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలి: డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు
పరకాల ,తెలంగాణ గళం, అక్టోబర్ 12:
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు పిలుపునిచ్చారు.
పరకాలలోని బీజేపీ పట్టణ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరకాల మండల కన్వీనర్ ఆకుల శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని ప్రతి వార్డు, బూత్ పరిధిలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. నాయకులు, వివిధ మోర్చాల బాధ్యులు సమన్వయంతో పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో 12వ వార్డు కౌన్సిలర్ కుక్కల విజయ్ కుమార్, ఆకుల శ్రీధర్ ,జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్పీ జయంతిలాల్, దేవునూర్ మేఘనాథ్, జిల్లా కోశాధికారి ఎర్రం రామన్న, పట్టణ నాయకులు, బూత్ అధ్యక్షులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






