తెలంగాణ

బీఆర్ఎస్ కు బీజేపీ నేత ఆకుల శ్రీధర్ ఘాటు సవాల్

పరకాల జిల్లా హోదాపై బీఆర్ఎస్ కు బీజేపీ నేత ఆకుల శ్రీధర్ ఘాటు సవాల్ పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 13: 10 ఏళ్లు అధికారంలో ఉండి పరకాలను జిల్లా చేయలేని BRS నేతలు ఇప్పుడు BJP ని విమర్శించడం సిగ్గుచేటు అన…

By · · Updated

Share this article
బీఆర్ఎస్ కు బీజేపీ నేత ఆకుల శ్రీధర్ ఘాటు సవాల్

పరకాల జిల్లా హోదాపై బీఆర్ఎస్ కు బీజేపీ నేత ఆకుల శ్రీధర్ ఘాటు సవాల్

పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 13:

10 ఏళ్లు అధికారంలో ఉండి పరకాలను జిల్లా చేయలేని BRS నేతలు ఇప్పుడు BJP ని విమర్శించడం సిగ్గుచేటు అని BJP నాయకుడు ఆకుల శ్రీధర్ ధ్వజమెత్తారు.

33 జిల్లాలు చేశామని గొప్పలు చెప్పుకున్న BRS, చారిత్రక పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించడంలో ఎందుకు విఫలమైందో చెప్పాలని నిలదీశారు.

రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చల్లా ధర్మారెడ్డి పరకాల ప్రజల ఆకాంక్షను తుంగలో తొక్కారని మండిపడ్డారు. కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తే జిల్లా వస్తుందా అంటూ ఘాటుగా విమర్శించారు.

దమ్ముంటే తేదీ, సమయం, స్థలం చెప్పి బహిరంగ చర్చకు రావాలని, 100 పడకల ఆసుపత్రి, అభివృద్ధి పనులపై ఆధారాలతో తేల్చుకుందామని సవాల్ విసిరారు.

 

Tags: