ఓటర్ల వివరాల సేకరణ, ఫారం-18 నింపే విధానంపై అవగాహన కల్పించిన ఒంటేరు శ్రావణ్ కుమార్
పరకాల ,తెలంగాణ గళం, అక్టోబర్ 13:
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్ కుమార్ బూత్ లెవల్ ఏజెంట్లకు (బీఎల్ఏలకు) సూచించారు.
పరకాల శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై బీఎల్ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఒంటేరు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, బీఎల్ఏలు తమ పరిధిలోని బూత్‌లలో పర్యటించి అర్హులైన పట్టభద్రుల ఓటర్ల వివరాలను సేకరించాలని సూచించారు. ఓటర్ల నమోదుకు సంబంధించిన ఫారం-18ను నిబంధనల ప్రకారం ఎలా నింపాలి, అవసరమైన వివరాలను ఎలా సేకరించాలి అనే అంశాలపై బీఎల్ఏలకు వివరించారు. ఓటరు నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొయ్యాడ శ్రీనివాస్, సుధమల్ల రమేష్, క్లస్టర్ ఇన్‌చార్జి మేరుగు శ్రీశైలం గౌడ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం శివకుమార్‌తో పాటు పలువురు బీఎల్ఏలు పాల్గొన్నారు.






