పరకాల, తెలంగాణ గళం, అక్టోబర్ 13:
పరకాల చలివాగులో ఇసుక దోపిడీ హద్దు దాటింది. అధికారుల అండతోనే మాఫియా రాత్రి, పగలు వాగును పీకేస్తోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
ట్రాక్టర్లతో వాగునంతా తోడేస్తున్నారు. అనుమతి లేకుండానే ఒక్కో ట్రాక్టర్‌ను వేలకు వేలు దండుకుంటూ జేబులు నింపుకుంటున్నారు.
ఇదంతా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా చూసీ చూడనట్లు వదిలేశారు. ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు కళ్లు తెరిచి ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.






