తెలంగాణ

పరిహారం ఇవ్వకుండా పంట పొలాలు ధ్వంసం చేస్తున్నారని రైతుల ఆగ్రహం

పోచారంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను అడ్డుకున్న రైతులు హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణ..  న్యాయమైన పరిహారం ప్రకటించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం పరకాల తెలంగాణ గళం అక్టోబర్…

By · · Updated

Share this article
పరిహారం ఇవ్వకుండా పంట పొలాలు ధ్వంసం చేస్తున్నారని రైతుల ఆగ్రహం

పోచారంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పనులను అడ్డుకున్న రైతులు

హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆరోపణ..

 న్యాయమైన పరిహారం ప్రకటించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం

పరకాల తెలంగాణ గళం అక్టోబర్ 13 

హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణ పనులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పనులు ప్రారంభించేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకుని నిరసనకు దిగారు. తమ పంట భూములకు న్యాయమైన పరిహారం చెల్లించకుండా పనులు చేపట్టడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. 

ముందస్తు సమాచారం ఇవ్వకుండా హడావుడిగా సర్వే నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిహారం లేకుండానే పంటలు ధ్వంసం చేస్తున్నారని ఆవేదన

తమకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండానే పంట పొలాలను ధ్వంసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. 

హైకోర్టు ఆదేశాలను సైతం పరిగణనలోకి తీసుకోవడం లేదని, ఇంకా సమయం ఉన్నప్పటికీ తమ పంటలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లముందే ధ్వంసమవుతుంటే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

కాంట్రాక్టర్లకు వేల కోట్ల నిధులు.. రైతులకు పరిహారం చెల్లించడంలో ఇబ్బందులా?

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రాజెక్టులో కాంట్రాక్టర్‌ మెగా కృష్ణారెడ్డికి ప్రభుత్వం అదనంగా రూ.4,000 కోట్లు మంజూరు చేసిందని, అదే సమయంలో రైతులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో మాత్రం ఇబ్బందులు పెడుతోందని రైతులు విమర్శించారు. కాంట్రాక్టర్‌ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ, సారవంతమైన భూములను కోల్పోతున్న రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. 

తమ భూములు, పంటలకు న్యాయమైన పరిహారం అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు.

Tags: