హనుమకొండ, తెలంగాణ గళం, అక్టోబర్ 13.
కరీంనగర్ : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కేకే (కేశవరావు) కమిటీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనకం కుమారస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల నివాస స్థలం మరియు నెలకు ₹25,000 పింఛన్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుపేద ఉద్యమకారుల జీవితాలలో వెలుగులు నింపేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ధర్నాలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
• కనకం కుమారస్వామి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
• చిలువేరు రమేష్ – రాష్ట్ర ప్రచార కార్యదర్శి
• మోదినిపురోజు రాము చారి – హనుమకొండ జిల్లా అధ్యక్షులు
• మార్క్ భాస్కర్ గౌడ్ – ములుగు జిల్లా అధ్యక్షులు
• మోటపోతుల సుధాకర్ గౌడ్ – వర్ధన్నపేట నియోజకవర్గం కో-కన్వీనర్
ఈ కార్యక్రమంలో కాజీపేట మండల అధ్యక్షుడితో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన పలువురు ఉద్యమకారులు, ఫోరం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






