గార్ల మండలంలో అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే ఇందిరమ్మ పక్కా గృహాలు మంజూరు చేయాలని సిపిఐ గార్ల మండల సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ... గార్ల మండలంలో వేలాది మంది నిరుపేద కుటుంబాలు రేకుల షెడ్లలో, గుడిసెల్లో దయనీయంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా నిరుపేదలను మోసం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం అయినా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కోరారు.
1. గార్ల మండలంలో ఇళ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
2. ఇళ్ల కేటాయింపులో అక్రమాలను, పక్షపాతాన్ని అరికట్టాలి. అర్హులైన వారికే ఇళ్లు ఇవ్వాలి.
3. లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారా జరగాలి.
4. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇస్తున్న రూ.5 లక్షలు సరిపోవడం లేదు, దానిని రూ.6 లక్షలకు పెంచాలి.
5. ఇప్పటికే మంజూరైన ఇళ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలి.
ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుపేదలకు న్యాయం చేయకపోతే, సిపిఐ ఆధ్వర్యంలో లబ్ధిదారులతో కలిసి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము.
ఈ సమావేశంలో జంపాల వెంకన్న, మేదరమెట్ల గిరిప్రసాద్, కట్టెబోయిన పిచ్చయ్య,భూక్య హరినాయక్, ధూపాటి జనార్ధన్, లావుడియా భీముడు నాయక్, ధరావత్ వీరన్న నాయక్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.






