General

దిగ్భ్రాంతి గొలిపిన నర్సు శిరీష దారుణ హత్య

ములకలపల్లి సెప్టెంబర్ 3 (తెలంగాణ గళం)హైదరాబాద్‌లో అత్యాచారానికి గురై, దారుణంగా హత్య కాబడిన నర్సు ఊకే శిరీష కుటుంబ సభ్యులను ఇల్లందు శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య గారు, స్థానిక అశ్వారావుపేట శాసనసభ్…

By · · Updated

Share this article
దిగ్భ్రాంతి గొలిపిన నర్సు శిరీష దారుణ హత్య

ములకలపల్లి సెప్టెంబర్ 3 (తెలంగాణ గళం)హైదరాబాద్‌లో అత్యాచారానికి గురై, దారుణంగా హత్య కాబడిన నర్సు ఊకే శిరీష కుటుంబ సభ్యులను ఇల్లందు శాసనసభ్యులు గౌరవ శ్రీ కోరం కనకయ్య గారు, స్థానిక అశ్వారావుపేట శాసనసభ్యులు శ్రీ జారే ఆదినారాయణ గారితో కలిసి పరామర్శించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష, హైదరాబాద్‌లోని ప్రైమ్ కేర్ హాస్పిటల్‌లో నర్సుగా విధులు నిర్వర్తిస్తూ హాస్టల్ గదిలో ఒక దుర్మార్గుడి చేతిలో దారుణ హత్యకు గురైంది. ఈ వార్త తెలిసిన వెంటనే ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు చౌటిగూడెంలోని శిరీష స్వగృహానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారితో కలిసి శిరీష చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా శోకసముద్రంలో మునిగిపోయిన శిరీష తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఎమ్మెల్యేలు ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని మరియు సంతాపాన్ని తెలియజేశారు. ఈ అమానుషానికి పాల్పడిన నిందితుడికి ప్రభుత్వం తరపున చట్టపరంగా అత్యంత కఠినమైన శిక్ష పడే విధంగా చూస్తామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గౌరవ ఎమ్మెల్యేలు భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాధిత కుటుంబానికి మద్దతుగా నిలిచారు.

Tags: