తాజా వార్తలు

వెంకట్రావుపేటలో దసరా ఉత్సవాలపై సమావేశం

  దసరా వేడుకల ఖర్చు భరించేందుకు 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్ ముందుకు చిన్నమ్మ ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షలతో రేకుల షెడ్డు నిర్మాణానికి కోమిరెడ్డి మోహన్‌రెడ్డి సహకారం   మెట్‌పల్లి, అక్టోబర్…

By · · Updated

Share this article
వెంకట్రావుపేటలో దసరా ఉత్సవాలపై సమావేశం

 

దసరా వేడుకల ఖర్చు భరించేందుకు 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్ ముందుకు

చిన్నమ్మ ఆలయ అభివృద్ధికి రూ.3 లక్షలతో రేకుల షెడ్డు నిర్మాణానికి కోమిరెడ్డి మోహన్‌రెడ్డి సహకారం

 

మెట్‌పల్లి, అక్టోబర్ 05,తెలంగాణ గళం:

 

 వెంకట్రావుపేట గ్రామంలో దసరా ఉత్సవాల నిర్వహణ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) సమావేశం నిర్వహించారు. వీడీసీ చైర్మన్ బూరం రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

 

దసరా ఉత్సవాలకు సంబంధించి దాదాపు రూ.1 లక్షకు పైగా ఖర్చు కానుండగా, మొత్తం ఖర్చును భరించేందుకు 11వ వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్ ముందుకు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన ప్రకటించారు.

 

అదేవిధంగా వెంకట్రావుపేటలోని చిలుకల చిన్నమ్మ ఆలయ అభివృద్ధికి కోమిరెడ్డి మోహన్‌రెడ్డి దాతగా ముందుకు వచ్చారు. ఆలయ ప్రాంగణంలో సుమారు రూ.3 లక్షలకు పైగా వ్యయంతో రేకుల షెడ్డు నిర్మించేందుకు ఆయన ముందుకు రావడం పట్ల గ్రామస్తులు అభినందించారు. ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావడం గ్రామ ఐక్యతకు, ఆధ్యాత్మిక కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా దసరా ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న కౌన్సిలర్ రెబ్బస్ మహేష్, చిన్నమ్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాత కోమిరెడ్డి మోహన్‌రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైన వీడీసీ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధికి సేవాభావంతో ముందుకు వచ్చే దాతలను ప్రోత్సహించాలని సమావేశంలో పలువురు అభిప్రాయపడ్డారు.

 

గ్రామంలో పండుగలు, ఆలయ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను గ్రామస్తులందరి సహకారంతో సమష్టిగా నిర్వహించాలని వీడీసీ చైర్మన్ బూరం రాజేష్ అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

 

ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్ రెబ్బస్ మహేష్, వీడీసీ చైర్మన్ బూరం రాజేష్, కోమిరెడ్డి రవి, బత్తుల ప్రసాద్, (చిలుకల చిన్నమ్మ ఆలయ కమిటీ సభ్యులు), కోలా అశోక్, శివరాత్రి, వీడీసీ క్యాషియర్ కైతి మహేష్, వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags: