తాజా వార్తలు

సీతారామ ప్రాజెక్టు కాల్వ విస్తరణపై పరిశీలన

చీమలపాడు–పాపకొల్లుగుండ్ల ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటన.. మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే అవకాశాలపై పరిశీలన. By Lakavath Sudhir  ఇల్లందు అక్టోబర్ 4 తెలంగాణ గళం: వైరా నియోజకవర్గం కారేపల్ల…

By · · Updated

Share this article
సీతారామ ప్రాజెక్టు కాల్వ విస్తరణపై పరిశీలన

చీమలపాడు–పాపకొల్లుగుండ్ల ప్రాంతాల్లో ఎమ్మెల్యేల పర్యటన.. మూడు నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే అవకాశాలపై పరిశీలన.

By Lakavath Sudhir 

ఇల్లందు అక్టోబర్ 4 తెలంగాణ గళం:

వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం చీమలపాడు గ్రామంలోని పాపకొల్లుగుండ్ల ప్రాంతాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డా. మురళీనాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ గూగులోత్‌ జ్యోతి రమేష్  పరిశీలించారు. సీతారామ ప్రాజెక్టు పరిధిలో పాలేరు వైపు చేపడుతున్న కాల్వ విస్తరణతోపాటు పంపింగ్‌, ఎత్తిపోతల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఇల్లందు, మహబూబాబాద్‌, డోర్నకల్‌ నియోజకవర్గాల పరిధిలోని రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేలా కాల్వను విస్తరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కాల్వ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలు, నీటి లభ్యత, విస్తరణ మార్గం తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు నీటిని ఆయా ప్రాంతాలకు మళ్లించడం ద్వారా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంతోపాటు తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే అవకాశాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు,చీమలపాడు సర్పంచ్ మాళోత్ లలిత బావుసింగ్,మహబూబాబాద్ పురపాలకం చైర్మెన్ జ్యోతి రమేష్,బయ్యారం మాజీ సోసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు తోటకూరి శీవయ్య,మార్కెట్ కమిటి డైరెక్టర్ గబ్రు నాయక్,బయ్యారం మాజీ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు వెల్పుల శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.