తాజా వార్తలు

సమాచార హక్కు చట్టం అమలులో భద్రాద్రికి పురస్కారం

గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్‌ అంకిత్‌ By Lakavath Sudhir  ఇల్లందు, అక్టోబర్‌ 9 (తెలంగాణ గళం): సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు భద్రాద్రి…

By · · Updated

Share this article
సమాచార హక్కు చట్టం అమలులో భద్రాద్రికి పురస్కారం

గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా అవార్డు అందుకున్న కలెక్టర్‌ అంకిత్‌

By Lakavath Sudhir 

ఇల్లందు, అక్టోబర్‌ 9 (తెలంగాణ గళం): సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమాచార హక్కు వారోత్సవాలు–2026 కార్యక్రమంలో గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ అవార్డును స్వీకరించారు.

ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, పౌరులకు సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించడం, చట్ట నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్టం అమలులో ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలను గుర్తించి అవార్డులను ప్రదానం చేశారు.

సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు పౌరులకు లభిస్తుందని, ప్రభుత్వ శాఖలు పారదర్శకంగా వ్యవహరిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండటం ముఖ్యమని కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. చట్ట నిబంధనల ప్రకారం ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, పారదర్శక పాలనను కొనసాగించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

Tags: