
మెట్‌పల్లి, అక్టోబర్ 05,తెలంగాణ గళం:
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, రైతులకు న్యాయం చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపెల్లి గోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమం కోసం పలు హామీలు ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
రైతులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, వాటి అమలు కోసం రైతులు చేపట్టిన సైకిల్ యాత్ర సోమవారం మెట్‌పల్లి మండలం విట్టంపేట గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా కోడిపెల్లి గోపాల్‌రెడ్డి రైతుల సైకిల్ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైతుల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రభుత్వం దృష్టికి రైతుల డిమాండ్లను తీసుకెళ్లేందుకు ఈ సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని కోరారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన బీజేపీ కిసాన్ మోర్చా నిరంతరం పోరాడుతుందని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు.
సైకిల్ యాత్రలో పాల్గొంటున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ఉద్యమానికి ప్రజలు, రైతులు మద్దతుగా నిలవాలని కోరారు.




