తాజా వార్తలు

రైతుల విజ్ఞప్తికి స్పందన.. ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదలకు ఆదేశాలు

    ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినతికి స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే   మెట్‌పల్లి, అక్టోబర్ 09,తెలంగాణ గళం:   కోరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్య…

By · · Updated

Share this article
రైతుల విజ్ఞప్తికి స్పందన.. ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదలకు ఆదేశాలు

 

 

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల వినతికి స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

 

మెట్‌పల్లి, అక్టోబర్ 09,తెలంగాణ గళం:

 

కోరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లా పరిధిలోని రైతుల పంటలకు సాగునీరు అందించాలన్న విజ్ఞప్తిపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) నుంచి సాగునీటిని విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల రైతుల సాగునీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

 

కోరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల రైతులు తమ పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్లను పలుమార్లు కోరారు. రైతుల అవసరాలు, పంటల సాగుకు నీటి ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే.. ఈ సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం ద్వారా సాగునీటి విడుదలకు విజ్ఞప్తి చేశారు.

 

రైతుల విజ్ఞప్తిని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే, ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేస్తే పంటలకు అవసరమైన సాగునీరు అందడంతో పాటు రైతులకు ఊరట లభిస్తుందని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగునీటి విడుదలకు సంబంధించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్‌ (ఈఎన్‌సీ)ని ఆదేశించారు.

 

అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ రమేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కోరుట్ల నియోజకవర్గంతో పాటు జగిత్యాల జిల్లా రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నీటి విడుదలలో జాప్యం జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించి, రైతుల అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

 

వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు సాగునీరు కీలకమని, పంటల సాగు సమయంలో నీటి లభ్యతకు ఆటంకాలు ఎదురైతే రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి, సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు త్వరితగతిన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

 

మంత్రి ఆదేశాలతో ఎస్సారెస్పీ నుంచి సాగునీటి విడుదలకు సంబంధించి అధికారులు చేపట్టే చర్యలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. సాగునీరు అందుబాటులోకి వస్తే పంటల సాగుకు తోడ్పాటు లభిస్తుందని రైతులు భావిస్తున్నారు.