దామెర ,తెలంగాణ గళం,సెప్టెంబర్ 4
ఈ నెల 7వ తేదీన దామెర మండల కేంద్రంలో రైతులతో కలిసి భారీ ధర్నా!
రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రైతు రుణమాఫీని వెంటనే, పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించనున్నాం.అలాగే మూడు విడతల రైతు భరోసా బకాయిలు వెంటనే చెల్లించాలని, సన్న వడ్ల బోనస్ అందించాలని, రైతులకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు–రాయితీలు సకాలంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.బీఆర్‌ఎస్ మోసం చేసింది.కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది రైతుల సమస్యలపై ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ, రైతుకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు గురిజాల శ్రీరామ్ రెడ్డి, మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి సూర చందర్, జిల్లా నాయకులు పిట్టల రమేష్, మండల ఉపాధ్యక్షులు దామసాని మనోజ్ రెడ్డి, లాదెళ్ల బుత్ అధ్యక్షులు అన్నబోయిన రోహిత్, తదితరులు పాల్గొన్నారు.



