తాజా వార్తలు

పూల పల్లకిపై బతుకమ్మ.. పల్లెపల్లెనా సంబరాలు!

రేపల్లెవాడలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. మహిళల సందడి By Lakavath Sudhir  ఇల్లందు, అక్టోబర్‌ 10 (తెలంగాణ గళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఇల్లందు మండల…

By · · Updated

Share this article
పూల పల్లకిపై బతుకమ్మ.. పల్లెపల్లెనా సంబరాలు!

రేపల్లెవాడలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. మహిళల సందడి

By Lakavath Sudhir 

ఇల్లందు, అక్టోబర్‌ 10 (తెలంగాణ గళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామ పంచాయతీ ఆవరణంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు చేరి ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ బానోత్‌ శారద ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను ప్రారంభించి, మహిళలతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణలో పుట్టి.. పూల పల్లకిపై కొలువుదీరే బతుకమ్మ పండుగ ప్రకృతితో మమేకమైన జీవనశైలికి, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సర్పంచ్‌ ఆకాంక్షించారు. వేడుకల్లో మహిళలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: