తాజా వార్తలు

పిఆర్సి ని వెంటనే ప్రకటించాలి

కమలాపూర్, తెలంగాణ గళం:  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని టిఎస్ యుటిఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు డిమాండ్ చేశారు.. మంగళవారం కమలాపూర్ మండలంలోని వ…

By · · Updated

Share this article
పిఆర్సి ని వెంటనే ప్రకటించాలి

కమలాపూర్, తెలంగాణ గళం: 

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్సిని వెంటనే ప్రకటించాలని టిఎస్ యుటిఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు డిమాండ్ చేశారు.. మంగళవారం కమలాపూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పిఆర్సి అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి 38 నెలలు గడిచినప్పటికీ నేటికి కూడా పిఆర్సి నివేదిక అందజేయలేదని అన్నారు... ప్రభుత్వం వెంటనే పిఆర్సి నివేదికను తెప్పించుకొని తక్షణo అమలు చేయాలని అన్నారు. ఈనెల 30తో పిఆర్సి గడువు పూర్తవుతున్నందున  గడువును పొడగించకుండా వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని అన్నారు.. పెండింగ్లో ఉన్న డి ఏ లను వెంటనే విడుదల చేయాలని, జేఏసీతో జరిగిన చర్చలలో ప్రభుత్వం  ఇస్తామన్న రెండు డీఎల జీవోలు వెంటనే విడుదల చేయాలని  అన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల  చేయాలని, దసరా  సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, జీవో నెంబర్ 25 వెంటనే సవరించాలని అన్నారు.. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సిఎస్ఆర్ మల్లిక్ సీనియర్ జిల్లా నాయకులు పల్లె శ్రీనివాస్,  మండల ప్రధాన కార్యదర్శి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Tags: