Notification

పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్..!

పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రూ.4 కోట్లతో 800 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వైరా నియోజకవర్గంలోని పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను గౌరవ ఎమ్…

By · · Updated

Share this article
పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్..!

పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రూ.4 కోట్లతో 800 కిలోవాట్ల సోలార్ ప్లాంట్ నిర్మాణం ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వైరా నియోజకవర్గంలోని పెద్దగోపతి సబ్‌స్టేషన్‌ను గౌరవ ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు, ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్ పరిధిలో జరుగుతున్న విద్యుత్ సంబంధిత అభివృద్ధి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా గౌరవ వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ మాళోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అందులో భాగంగా పెద్దగోపతి గ్రామంలో విద్యుత్ శాఖ సహకారంతో సుమారు రూ.4 కోట్ల వ్యయంతో 800 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.సుమారు 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఈ సోలార్ ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్లాంట్ ద్వారా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి విద్యుత్ అవసరాలను తీర్చేందుకు దోహదపడటంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని, భవిష్యత్‌లో సోలార్ విద్యుత్‌కు మరింత ప్రాధాన్యత పెరగనుందని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. పెద్దగోపతిలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ స్థానికంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ భూమిని ప్రజా ప్రయోజనాలకు వినియోగిస్తూ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టడం అభినందనీయమని సుడా ఛైర్మన్ శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులను సంబంధిత అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం విద్యుత్ శాఖ డి ఈ రమేష్ , AE భరత్ లను గ్రామంలో ఉన్న స్తంభాలను విద్యుత్ మరమ్మత్తులను త్వరితగతన పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ వడ్డే నారాయణరావు , మండల కాంగ్రెస్ అధ్యక్షులు సవళ్ళ నాగేశ్వరరావు , జిల్లా కాంగ్రెస్ నాయకులు సూరంపల్లి రామారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్, ఎలనాటి మురళి, పెద్దగోపతి మాజీ సర్పంచ్లు నల్లమోతు భద్రయ్య , తడకమళ్ళ దానేలు, పిఎస్ఎస్ మాజీ అధ్యక్షుడు తాళ్లూరు పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Tags: