నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ జి. లోకేశ్ యాదవ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించాలని బలహీన వర్గాల నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ, పదవుల కోసం పార్టీని వీడకుండా నిబద్ధతతో కొనసాగుతున్న నాయకుల్లో డాక్టర్ లోకేశ్ యాదవ్ ఒకరని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యావంతులు, యువతలో మంచి గుర్తింపు ఉన్న డాక్టర్ లోకేశ్ యాదవ్‌కు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం లభించడంతో పాటు పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో బలంగా వినిపించే అవకాశం ఉంటుందని నేతలు అన్నారు.
కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నిబద్ధత కలిగిన నాయకుడిగా డాక్టర్ లోకేశ్ యాదవ్‌ను అధిష్ఠానం గుర్తించి, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని బలహీన వర్గాల నేతలు కోరారు





